logo

ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బలిజిపేట మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

Updated : 28 May 2023 19:45 IST

బలిజిపేట: బలిజిపేట మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బలిజిపేట బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులు భోగ రామారావు, శ్రీనివాసరావు, పడాల నారాయణరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రాజమహేంద్రవరంలో నిర్వహించిన తెదేపా మహానాడుకు మండలం నుంచి 51 మంది కార్యకర్తలు పయనమయ్యారు. వీరికి  తెదేపా మండల అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు నాయకత్వం వహించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు