logo

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే వైకాపా ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు.

Published : 31 May 2023 03:21 IST

కేకు కోస్తున్న జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, నాయకులు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే వైకాపా ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వైకాపా అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం చీపురుపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి కేకు కోశారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థలను తీసుకొచ్చి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు పేదల కోసం ఆలోచన లేదన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారమే పరమావధిగా హామీలు ఇస్తున్నారని, చివరికి ఆల్‌ఫ్రీ బాబుగా మిగిలిపోతారన్నారు. నాయకులు కేవీ.సూర్యనారాయణరాజు, ఇప్పిలి అనంతం, శ్రీనివాసనాయుడు, శ్రీనివాసరావు, వేణు, విశ్వేశ్వరరావు, సుధారాణి పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని