logo

కంకర తవ్వేసి.. తోడేసి

మండలంలోని అంబటివలస గ్రామానికి సమీపంలో ఉన్న కంకర కొండ కరిగిపోతోంది. ప్రజాప్రతినిధుల సహకారంతో స్థానికంగా ఉన్న పలువురు అక్రమార్కులు రాత్రి వేళల్లో తవ్వి, తరలిస్తున్నారు.

Published : 31 May 2023 03:25 IST

అంబటివలస సమీపంలో కరిగిపోతున్న కొండ

బొండపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని అంబటివలస గ్రామానికి సమీపంలో ఉన్న కంకర కొండ కరిగిపోతోంది. ప్రజాప్రతినిధుల సహకారంతో స్థానికంగా ఉన్న పలువురు అక్రమార్కులు రాత్రి వేళల్లో తవ్వి, తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు గనుల శాఖా ఏడీ జి.రవికుమార్‌, ఇతర అధికారులు వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన కొండతోపాటు దాని చుట్టూ ఉన్న డీపట్టా భూముల్లోనూ గ్రావెల్‌ తవ్వుతున్నట్లు గుర్తించారు. అక్కడున్న మూడు లారీలు, ఒక జేసీబీని సీజ్‌ చేసినట్లు రవికుమార్‌ తెలిపారు. విచారణ చేస్తున్నామని, చర్యలు తీసుకుంటామన్నారు.


తూనికల శాఖ అధికారుల బదిలీ

నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా పరిధిలో తూనికలు-కొలతల శాఖ అధికారులు బదిలీ అయ్యారు. రెండు జిల్లాల సహాయ సంచాలకుడు జనార్దనరావు కాకినాడకు, ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణ గాజువాక బదిలీ అయ్యారు. వీరి స్థానంలో ఇంకా ఎవర్నీ నియమించలేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని