logo

ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు

రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ శ్రీకాకుళం రీజియన్‌ అధికారి ఎ.సురేష్‌బాబు హెచ్చరించారు.

Published : 01 Jun 2023 04:02 IST

పూసపాటిరేగలోని ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న విజిలెన్స్‌,ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

అయ్యన్నపేట, పూసపాటిరేగ, డెంకాడ, న్యూస్‌టుడే: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ శ్రీకాకుళం రీజియన్‌ అధికారి ఎ.సురేష్‌బాబు హెచ్చరించారు. బుధవారం విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, డెంకాడ తదితర ప్రాంతాల్లో దుకాణాలను తనిఖీ చేశారు. పూసపాటిరేగలోని రెండు దుకాణాలను పరిశీలించారు. దస్త్రాలను చూశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అమ్మాలని, అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సింహాచలం, హెడ్‌ కానిస్టేబుల్‌ అప్పన్న, డెంకాడ, పూసపాటిరేగ ఏవోలు పి.నిర్మల, కె.నీలిమ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని