logo

జనసేన నాయకుల నిరసన దీక్ష

బలిజిపేట మండలంలోని బర్లిలో నెలకొన్న ప్రజా సమస్యలను ఇటీవల వైకాపా ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకువెళ్లిన సమయంలో వైకాపా గ్రామస్థాయి నాయకులు భౌతిక దాడులకు పాల్పడ్డారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి పాలూరు బాబు ఆరోపించారు.

Published : 01 Jun 2023 04:34 IST

జనసేన నాయకులతో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి జగదీశ్‌ తదితరులు

బలిజిపేట, న్యూస్‌టుడే: బలిజిపేట మండలంలోని బర్లిలో నెలకొన్న ప్రజా సమస్యలను ఇటీవల వైకాపా ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకువెళ్లిన సమయంలో వైకాపా గ్రామస్థాయి నాయకులు భౌతిక దాడులకు పాల్పడ్డారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి పాలూరు బాబు ఆరోపించారు. ఆ దాడులను నిరసిస్తూ బుధవారం బలిజిపేట బస్టాండు సమీపంలో దీక్ష చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున జనసైనికులు తరలివచ్చారు. వీరికి సంఘీభావంగా తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీశ్‌, పార్వతీపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి బొబ్బిలి చిరంజీవులు, పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి ఎం.అప్పారావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు యమ్మల మన్మథరావు తదితరులు దీక్షలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. దాడులకు పాల్పడినవారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. ఎమ్మెల్యే జోగారావు జనసేన కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు