అభివృద్ధి, సంక్షేమానికి బాటలు
మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి బాటలు పడతాయని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డి.జగదీశ్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పేర్కొన్నారు.
పార్వతీపురం, న్యూస్‌టుడే: మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి బాటలు పడతాయని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డి.జగదీశ్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుధవారం పార్వతీపురంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తెదేపా పథకాలతో యువత, మహిళలు, విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జి.ఉదయభాను, కె.వెంకటరావు జి.రవికుమార్, డి.మోహనరావు, కె.తిరుపతిరావు, భాస్కరరావు, కార్తిక్, గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.