logo

గుర్తుకొస్తున్నాయి..

మడ్డువలస జలాశయం నిర్మాణ సమయంలో సర్వం కోల్పోయిన నిర్వాసిత గ్రామాల్లో మగ్గూరు ఒకటి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేపట్టడానికి వీలుగా నీటిని బయటకు విడిచిపెట్టేయడంతో లోపలి భాగం ఇలా ఎండిపోయి దర్శనమిస్తోంది.

Published : 02 Jun 2023 02:45 IST

న్యూస్‌టుడే, వంగర: మడ్డువలస జలాశయం నిర్మాణ సమయంలో సర్వం కోల్పోయిన నిర్వాసిత గ్రామాల్లో మగ్గూరు ఒకటి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేపట్టడానికి వీలుగా నీటిని బయటకు విడిచిపెట్టేయడంతో లోపలి భాగం ఇలా ఎండిపోయి దర్శనమిస్తోంది. దీంతో అప్పట్లో మునిగిపోయిన గ్రామాల శిథిలాలు బయటపడుతున్నాయి. పాత మగ్గూరు గ్రామ అవశేషాలు కనిపిస్తున్నాయి. తాగునీటికి వినియోగించిన బావి, గ్రామ దేవత గుడి, వంగర సమీపంలో నీళ్లరేవు వద్ద ఏర్పాటు చేసిన మెట్లు, నీడనిచ్చిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. దీంతో నిర్వాసితులు తమ పిల్లలతో వాటిని చూసేందుకు తరలి వెళుతున్నారు. నాటి జ్ఞాపకాలను తమ పిల్లలకు తెలియజేస్తూ మధురానుభూతి చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని