ఎట్టకేలకు మరమ్మతులు
విజయనగరం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే ముషిడిపల్లి మంచినీటి పథకం పైపులైనుకు ఏర్పడిన రంధ్రాన్ని ఎట్టకేలకు సిబ్బంది పూడ్చారు.
గంట్యాడ, న్యూస్‌టుడే: విజయనగరం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే ముషిడిపల్లి మంచినీటి పథకం పైపులైనుకు ఏర్పడిన రంధ్రాన్ని ఎట్టకేలకు సిబ్బంది పూడ్చారు. తాటిపూడి వద్దగల ముషిడిపల్లి నుంచి విజయనగరానికి తాగునీరు సరఫరా అవుతున్న పైపునకు గంట్యాడలోని పెట్రోల్ బంకు సమీపంలో చిల్లు పడింది. గత మూడునెలలుగా సంబంధిత అధికారులు, సిబ్బంది స్పందించకపోవడంతో తాగునీరు వృథాగా పక్కనున్న పొలాల్లోకి వెళ్లిపోయేది. దీంతో ఆ భూముల రైతులు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ సమస్యపై ‘ఈనాడు’లో ‘నవ్విపోదురుగాక..’ శీర్షికన ఇచ్చిన కథనంపై స్పందించారు. గుత్తేదారు, అధికారులు గురువారం పైపు రంధ్రాలను మూయించి వృథాను అరికట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.