logo

తాగునీరు సరఫరా చేయాలని సచివాలయం ముట్టడి

గంగాడ గ్రామంలోని సెగిడి వీధి, కొండవీధిలో తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుపుతూ శుక్రవారం ఆ గ్రామ మహిళలు సచివాలయాన్ని ముట్టడించారు.

Updated : 02 Jun 2023 17:50 IST

బలిజిపేట: గంగాడ గ్రామంలోని సెగిడి వీధి, కొండవీధిలో తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుపుతూ శుక్రవారం ఆ గ్రామ మహిళలు సచివాలయాన్ని ముట్టడించారు. ఆ గ్రామ మహిళలంతా ఖాళీ బిందెలతో సచివాలయం వద్ద ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. కుళాయి పైపులైన్‌ ద్వారా తాగునీరు గ్రామమంతా ఇవ్వాలని, లేని పక్షంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఎం నాయకుడు యమ్మల మన్మథరావు హెచ్చరించారు. వారంలోగా తాగునీరందిస్తామని పంచాయతీ అధికారులు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని