logo

ఆలయ పనులు అడ్డుకుంటే సహించం

గుమ్మలక్ష్మీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో చేపడుతున్న త్రిమూర్తుల ఆలయ ఆధునికీకరణ పనులు అడ్డుకుంటే సహించేది లేదని గ్రామస్థులు నినాదాలు చేశారు.

Published : 03 Jun 2023 03:25 IST

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గుమ్మలక్ష్మీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో చేపడుతున్న త్రిమూర్తుల ఆలయ ఆధునికీకరణ పనులు అడ్డుకుంటే సహించేది లేదని గ్రామస్థులు నినాదాలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ అధికారులు ఆలయానికి చేరుకుని దేవుని ఫొటోలు తీసుకెళ్లి కారులో పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని పాత స్థానంలోనే ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఎల్విన్‌పేట ఎస్సై షన్ముఖరావు, పోలీసులు చేరుకొని గ్రామస్థులతో చర్చించారు. సర్పంచి గౌరీశంకరరావు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా రావిచెట్టు దగ్గర ఆలయం ఉందని, ప్రస్తుతం ఆధునికీకరిస్తుంటే అడ్డుకోవడం తగదన్నారు. ప్రతి నెలా దుకాణాల నుంచి సుమారు రూ.70 వేల అద్దె వసూలు చేస్తున్న అధికారులు కనీసం రహదారి నిర్మాణంపై దృష్టి సారించలేదని నిలదీశారు. బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గిరిబాబు, ఉప ఎంపీపీ శేఖరు, వర్తక, వైశ్య, దోస్త్‌మేరాదోస్త్‌ సంఘాల నాయకులు హరిప్రసాద్‌, విష్ణుప్రసాద్‌, ప్రేమానంద్‌ తదితరులు ఉన్నారు. అక్రమ స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీపీటీవో సుధాకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని