logo

రైతు శ్రేయస్సుకు ప్రాధాన్యం

విత్తనం నాటిన నుంచి పంట విక్రయించే వరకు రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ అన్నారు.

Updated : 03 Jun 2023 04:42 IST

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: విత్తనం నాటిన నుంచి పంట విక్రయించే వరకు రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ అన్నారు. పార్వతీపురంలో రెండో విడత వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం మెగా మేళాలో ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, ఇతర పరికరాలను ఎమ్మెల్యే జోగారావుతో కలిసి కలెక్టరు పంపిణీ చేశారు. ఆర్బీకేల పరిధిలోని 127 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల పరిధిలోని రైతు సంఘాలకు యంత్రాలను అందజేసినట్లు చెప్పారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో పంటలను కొనుగోలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. జిల్లా పరిధిలో 78 ట్రాక్టర్లు, నాలుగు ధాన్యం నూర్పిడి యంత్రాలు, ఇతర పరికరాలు అందజేసినట్లు కలెక్టర్‌ వివరించారు. వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, ఆత్మ ఛైర్మన్‌ తిరుపతిరావు, పుర ఛైర్‌పర్సన్‌ గౌరీశ్వరి, ఎంపీపీ శోభారాణి, వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని