logo

ప్లాస్టిక్‌తో మానవాళికి తీవ్ర ముప్పు

ప్లాస్టిక్‌ విచ్చలవిడి వినియోగంతో మానవాళికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ఐఐపీఈ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ) డైరెక్టర్‌, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డా.వీఎస్‌ఆర్‌కె.ప్రసాద్‌ అన్నారు.

Published : 06 Jun 2023 03:04 IST

విజయనగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖాధికారులు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ప్లాస్టిక్‌ విచ్చలవిడి వినియోగంతో మానవాళికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ఐఐపీఈ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ) డైరెక్టర్‌, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డా.వీఎస్‌ఆర్‌కె.ప్రసాద్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం కాలుష్య నియంత్రణ మండలి, ఆటవీశాఖల ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ, జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేడు ప్లాస్టిక్‌ మానవుని జీవితంలో భాగమైందని, దాన్ని సక్రమంగా వినియోగించాలని కోరారు. అనంతరం సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. అంతకుముందు బాలాజీ కూడలి, మయూరి కూడలి, ఎత్తు బ్రిడ్జి మీదుగా ర్యాలీ సాగింది. కాలుష్య నియంత్రణ మండలి విజయనగరం డివిజన్‌ ఈఈ టి.సుదర్శన్‌, అటవీశాఖ అధికారి ఎస్‌.వెంకటేష్‌, జిల్లా పరిషత్తు సీఈవో ఎం.అశోక్‌కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ డా.గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని