logo

నిరాస్తకత ఎందుకో !

చేపల రిటైల్‌ అవుట్లెట్ విలువ రూ.3.25 లక్షలు. దీని నిర్వహణకు లబ్ధిదారుడు 10 శాతం వాటా అంటే రూ.32,500 భరిస్తే, మిగిలిన 90 శాతం బ్యాంకు  రుణం సమకూర్చుతారు.

Updated : 06 Jun 2023 05:24 IST

చేపల అవుట్‌లెట్ల ఏర్పాటుకు ముందుకు రాని మహిళా సంఘాలు

న్యూస్‌టుడే, బొబ్బిలి

ప్రభుత్వ అవుట్‌లెట్ల నమూనా...


యూనిట్ నిర్వహణ ఇలా..

చేపల రిటైల్‌ అవుట్లెట్ విలువ రూ.3.25 లక్షలు. దీని నిర్వహణకు లబ్ధిదారుడు 10 శాతం వాటా అంటే రూ.32,500 భరిస్తే, మిగిలిన 90 శాతం బ్యాంకు  రుణం సమకూర్చుతారు. ఆ మొత్తంతో 30 రకాల పరికరాలను అందజేస్తారు. ఫిష్‌ డిస్‌ప్లే, యూనిట్ కవర్‌, లైవ్‌ఫిష్‌ ట్యాంకు, ఇన్వర్టర్‌, టేబుల్‌, తూనిక యంత్రం, టేబుల్‌, బిన్లు, కటింగు యంత్రాలు, స్ట్రక్చర్‌ తదితర వస్తువులు సమకూర్చుతారు. ఇవన్నీ సంఘ సభ్యులు వినియోగించుకోవాలి. నిర్ధేశిత ధరకు చేపలను సరఫరా చేస్తారు. వచ్చిన ఆదాయంలో నిర్వహణ ఛార్జీలు, బ్యాంకు రుణం చెల్లించాలి.

చేపల విక్రయం ద్వారా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం సూచిస్తున్న అవుట్‌లెట్‌ల ఏర్పాటుకు ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల నుంచి స్పందన కరవవుతోంది. ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మత్స్యశాఖ, మెప్మా అధికారులు సమన్వయంతో సంఘాలను సమన్వయ పరిచి వీటిని ఏర్పాటు చేయించాలన్న లక్ష్యం నీరుగారుతోంది.  


మాకొద్దంటూ ససేమిరా..

ఉమ్మిడి జిల్లాలోని పురపాలికల్లో మొత్తం 15 వేల సంఘాల్లో 1.50 లక్షల మంది సభ్యులు ఉన్నారు. యూనిట్ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు అందజేస్తామన్నా సంఘాల సభ్యులు నిర్వహణకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో పురపాలికలో కనీసం 10 మంది కూడా స్టాళ్ల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా కాలేదు. మెప్మా సిబ్బంది అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నా.. స్థల సమస్య కారణంగా చాలామంది వెనుకంజ వేస్తున్నారు.


లక్ష్యం ఇదీ..  

* మహిళా సంఘాలకు మెరుగైన ఆదాయం సమకూర్చడం
* వ్యాపారపరంగా మరింత వృద్ధి సాధించడం
*ఎగుమతులు చేసే స్థాయికి చేర్చడం
* జీవనోపాధులు మెరుగుపర్చడం
* నాణ్యమైన చేపలు అందుబాటులోకి తేవడం.

వాస్తవ పరిస్థితులు ఇలా..

* చేపల విక్రయాలపై సభ్యులకు అవగాహన లేకపోవడం
* ఆ వ్యాపారంపై ఆసక్తి లేకపోవడం
* జాగ్రత్తలు తీసుకోకుంటే పూర్తిగా నష్టపోతామన్న భావన
* ప్రభుత్వ రుణాల్లో ఎలాంటి రాయితీలు లేకపోవడం
* పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థలాలు లభ్యంకాకపోవడం
* సకాలంలో బ్యాంకు రుణం తీర్చలేమన్న సందేహం.


చైతన్యం కల్పిస్తున్నాం...: రిటైల్‌ అవుట్‌లెట్ల ప్రయోజనాలు సంఘాలకు తెలియజేస్తున్నాం. సభ్యులు సానుకూలంగా ఆలోచిస్తే లాభాలు వస్తాయి. ఆశించిన స్పందన లేకపోవడంతో అవగాహన కల్పిస్తున్నాం. సభ్యులు వ్యాపార ధోరణిలో ఆలోచించాలి. మత్స్యశాఖ తరఫున సమావేశాలు నిర్వహించి లాభాలు చెప్పాం.  
సుధాకర్‌, మెప్మా జిల్లా పథక సంచాలకుడు,

సంతోష్‌, మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని