logo

పర్యావరణ పరిరక్షణతో ప్రశాంత జీవనం

పర్యావరణ పరిరక్షణతో మానవాళి మనుగడ ప్రశాంతంగా ఉంటుందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర అన్నారు.

Updated : 06 Jun 2023 05:26 IST

ఉప ముఖ్యమంత్రి

పర్యావరణం కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తున్న రాజన్నదొర, అటవీశాఖ అధికారులు

సాలూరు, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణతో మానవాళి మనుగడ ప్రశాంతంగా ఉంటుందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో నీడ్‌ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. భూమి, గాలి, నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం పర్యావరణ దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ కాలుష్యం నివారించాలంటే మొక్కలు నాటాలని, అడవులు పెంచాలని సూచించారు. అనంతరం పర్యావరణం కాపాడుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారిణి ప్రసూన, నీడ్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌, మెప్మా సీఎంఎం పుష్ప, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని