logo

భూ సమస్యలే అధికం

కలెక్టరేట్‌లో జరిగిన జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌, డీఆర్వో వెంకటరావు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.

Updated : 06 Jun 2023 05:21 IST

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టరు నిశాంత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌, డీఆర్వో వెంకటరావు

పార్వతీపురం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో జరిగిన జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌, డీఆర్వో వెంకటరావు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 72 రాగా, వీటిలో ఎక్కువగా భూ సంబంధిత ఫిర్యాదులే ఉన్నాయని అధికారులు తెలిపారు. జిరాయితీ భూములు దేవాలయాల జాబితాలో చేరడం, ప్రభుత్వ భూములుగా నమోదు కావడం లాంటి సమస్యలతో సర్వే సమయంలో అవస్థలు పడుతున్నామని పలువురు వాపోయారు. వీటిని పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్లకు అధికారులు ఆదేశించారు.

గుక్కెడు నీరివ్వండి..: కలెక్టరేట్ ప్రాంగణం: గుక్కెడు నీరు లేక అల్లాడి పోతున్నామంటూ మక్కువ మండలం లోవరఖండి గ్రామస్థులు కలెక్టరేట్‌ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో బోర్ల నుంచి బురద వస్తుండడంతో గెడ్డ నుంచి తెచ్చుకుంటున్నామన్నారు. స్థానిక అధికారులను ఆశ్రయిస్తే ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లాలనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.


డబ్బులు ఇప్పించండి..: సీతానగరం మండలం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారంలో కార్మికులుగా పనిచేసిన 260 మందికి భవిష్యనిధి మొత్తాలను ఇప్పించాలని కార్మిక సంఘం కార్యదర్శి సన్యాసిరావు, కార్మికులు కోరారు. ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం కర్మాగారం ఆస్తులను జప్తు చేసి, రైతులకు చెల్లించారన్నారు. మిగిలిన మొత్తం కార్మికులకు భవిష్యనిధిగా చెల్లించాలని కోరారు. బకాయిలు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని