logo

కురుపాంలో మెగా జాబ్మేళా

కురుపాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఈ నెల 16న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

Published : 06 Jun 2023 03:17 IST

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: కురుపాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఈ నెల 16న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గోడప్రతులు విడుదల చేశారు. ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 10 యాజమాన్య సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీడీ విద్యార్థులు www.apssdc.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్‌, ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని