logo

స్పందించి.. విరాళాలు పోగేసి

జిల్లాలో హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌.ఎల్లమ్మకు హోంగార్డులు అండగా నిలిచారు. ఆమె కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యల దృష్ట్యా ముందుకొచ్చి విరాళాలు సేకరించారు.

Published : 07 Jun 2023 03:49 IST

ఎల్లమ్మకు చెక్కు అందిస్తున్న ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌

విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌.ఎల్లమ్మకు హోంగార్డులు అండగా నిలిచారు. ఆమె కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యల దృష్ట్యా ముందుకొచ్చి విరాళాలు సేకరించారు. ఈ మేరకు రూ.3,20,920 విలువైన చెక్కును మంగళవారం నగరంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ చేతులమీదుగా అందజేశారు. ‘చేయూత’ కార్యక్రమం కింద తోటి ఉద్యోగులకు అండగా ఉండడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్‌, ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, కార్యాలయ పర్యవేక్షకుడు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

నేరవార్తావిభాగం: పోలీసులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ సూచించారు. తిరుమల- మెడికవర్‌ ఆసుపత్రి యాజమాన్యం సహకారంతో మంగళవారం వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని