logo

అన్నదాతకు అండగా అడుగులు

ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) అన్నదాతలకు అండగా నిలుస్తోంది.

Published : 07 Jun 2023 04:26 IST

సేవల  విస్తరణతో  కేవీకే ఆదర్శం

కృషి విజ్ఞాన కేంద్రం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఖరీఫ్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు రైతులు ఆచరిస్తున్న సాగు పద్ధతులు, పంట దిగుబడిని పరిగణనలోకి తీసుకుని సూచనలు చేస్తోంది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతు చెంతకు చేరుస్తోంది. శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, కిసాన్‌ మేళాలు, పంట ఉత్పత్తుల ప్రదర్శన, పలు రకాల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందిస్తూ ముందుకెళ్తోంది.

వెయ్యి మందికి పైగా...

ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి మంది రైతులకు కేవీకే సేవలందిస్తోంది. ఇకపై 1500 మంది రైతులకు సేవలందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన రహదారుల పక్కనే వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు, సేంద్రియ, ప్రకృతి సేద్యం ప్రాధాన్యతపై అవగాహన కల్పించనుంది. గ్లాడియోలస్‌ వంటి అరుదైన పూల రకాలను పెంచేలా ప్రోత్సహిస్తోంది. ఆయా మార్గాల్లో ప్రయాణించే వారికి అవగాహన కలుగుతుంది.

పెంచుతున్న టర్కీ కోళ్లు

ప్రణాళిక అమలు ఇలా...

సాధారణంగా రైతులు సాగులో పాత రకాలనే ఎంపిక చేసుకుంటారు.

* కొత్త వంగడాలను రైతులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో బీర, టమాటా, వంకాయ, దాల్చినచెక్క వంటి కొత్తరకాల విత్తనాలు రైతులకు ఉచితంగా అందజేయనున్నారు.

* 10 వేల జీడి మొక్కలు పంపిణీ చేసేందుకు, నర్సరీలు సిద్ధం చేస్తున్నారు.

* ఆధునిక పద్ధతులపై శాస్త్రవేత్తలు నిరంతరం సూచనలిస్తున్నారు.

* అరుదైన టర్కీ కోళ్ల పెంపకం చేపడుతున్నారు. వీటి నుంచి పిల్లల్ని ఉత్పత్తి చేసి, జిల్లాకు పరిచయం చేయనున్నారు.

* పుట్టగొడుగుల పెంపకం, వానపాములతో వర్మీకంపోస్టు తయారీపై శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే చిరుధాన్యాలతో విలువ ఆధారిత బేకరీ, బిస్కెట్లు తయారు చేయడం.

* జీడి పండ్లతో ఉప ఉత్పత్తుల తయారీపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి: కేవీకే సేవలను రైతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. కాలానుగుణంగా రైతు ఆలోచన విధానంలో మార్పు రావాలి. నూతన యాంత్రీకరణపై దృష్టిసారించి, పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలి. సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. రహదారుల పక్కనే ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నాం.

డాక్టర్‌ టీఎస్‌ఎస్‌కే పాత్ర్‌, కేవీకే సమన్వయకర్త

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని