logo

విత్తనాల కొరత రానివ్వద్దు

ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ఆర్బీకేల్లో నిల్వలు ఉంచాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారులతో మంగళవారం సమీక్షించారు.

Published : 07 Jun 2023 04:45 IST

సూచనలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ఆర్బీకేల్లో నిల్వలు ఉంచాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారులతో మంగళవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు కావాల్సిన వాటిని ముందుగానే ఆన్‌లైన్లో నమోదు చేయించాలన్నారు. జిల్లాలో యంత్రసేవా పథకానికి 11 మంది మాత్రమే ఎంపికయ్యారని, మరో 34 మందిని గుర్తించాలన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యం 2,300 హెక్టార్లలో ప్లాంటేషన్‌ పూర్తి చేయాలన్నారు. 68 ఫిష్‌ ఆంధ్రా దుకాణాల ఏర్పాటుకు అవసరమైన రుణాలు అందజేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల అధికారులు రాబర్ట్‌పాల్‌, కె.ఎస్‌.ఎన్‌.రెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని