logo

సమావేశాలను సద్వినియోగం చేసుకోని తెదేపా

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్‌ మీద రాద్ధాంతం చేస్తున్న తెదేపా శాసనసభ సమావేశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిందని డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం నగరంలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు.

Published : 24 Sep 2023 05:18 IST

ఉప సభాపతి వీరభద్రస్వామి

మాట్లాడుతున్న కోలగట్ల

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్‌ మీద రాద్ధాంతం చేస్తున్న తెదేపా శాసనసభ సమావేశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిందని డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం నగరంలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో వాస్తవం ప్రజలకు తెలిపేందుకు శాసనసభలో వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ సభ్యులే జారవిడుచుకున్నారని విమర్శించారు. 21, 22 తేదీల్లో జరిగిన సమావేశాల్లో తెదేపా సభ్యుల ప్రవర్తనను ప్రజలంతా గమనించారని చెప్పారు. అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో మీసం తిప్పడం.. విజిల్‌ వేయడం ద్వారా అగౌరవపరిచారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌ మీద చర్చ కోరకుండా, కేసులు ఎత్తివేయాలని అరవడం ఎంత వరకు సమంజసమన్నారు. ఎన్టీఆర్‌ వెన్నుపోటులో భాగస్వామి అయిన అశోక్‌ ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తుంటారని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పోలీసు వారి అనుమతి తీసుకుంటే బాగుంటుందని బేబినాయన అరెస్ట్‌ విషయంలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని