logo

ఏనుగుల సంచారంతో ఆందోళన

మండలంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఏడు ఏనుగుల గుంపు పాత దుగ్గిలో తిష్ఠ వేసింది. ఒంటరి ఏనుగు జంఝావతి రబ్బరు డ్యామ్‌ సమీపంలోని నడిమివలసలో తిరగాడుతోంది

Published : 24 Sep 2023 05:33 IST

పాత దుగ్గిలో గజరాజుల గుంపు

కొమరాడ, న్యూస్‌టుడే: మండలంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఏడు ఏనుగుల గుంపు పాత దుగ్గిలో తిష్ఠ వేసింది. ఒంటరి ఏనుగు జంఝావతి రబ్బరు డ్యామ్‌ సమీపంలోని నడిమివలసలో తిరగాడుతోంది. కురుపాం మండలం జరడ అటవీ ప్రాంతంలో మరో నాలుగు ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరిరాజులను దూరంగా తరలించాలని కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని