logo

‘ఓపీఎస్‌పై హామీలు ఏమయ్యాయి?’

రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌కి బదులుగా జీపీఎస్‌ను తీసుకురావడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో, ఏపీసీ, పీఎస్‌ఈఏల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద వినూత్న నిరసన తెలిపారు

Updated : 24 Sep 2023 06:16 IST

మెడకి ఉరి తాళ్లతో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

పార్వతీపురం పట్టణం, పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌కి బదులుగా జీపీఎస్‌ను తీసుకురావడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో, ఏపీసీ, పీఎస్‌ఈఏల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద వినూత్న నిరసన తెలిపారు. మెడకు ఉరితాళ్లు బిగించుకొని ఆందోళన చేపట్టారు. జీపీఎస్‌ వద్దు.. ఓపీఎస్‌ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయారని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు అన్నారు. ఇప్పుడేమో సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్‌ తీసుకురావడమంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేయడమేనన్నారు. ఓపీఎస్‌ సాధించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. వివిధ సంఘాల నాయకులు శ్రీనివాసరావు, బాలకృష్ణ, శివున్నాయుడు, కె.విజయ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.   

పాలకొండ తహసీల్దారు కార్యాలయం ముందు ఉపాధ్యాయులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సంఘ నాయకులు ఎస్‌.వాసుదేవరావు, జి.సూర్యనారాయణ, టి.ఉమామహేశ్వరరావు, బీవీ రమణ, కె.పద్మజ, నాగరాజు, పైడిరాజు, గోవిందరావు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని