logo

కదం తొక్కి.. గళం విప్పి

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.విజయ్‌చంద్ర, మహిళా విభాగం నాయకురాలు డి.శ్రీదేవి ఆధ్వర్యంలో బాబు కోసం- మేము సైతం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

Updated : 24 Sep 2023 06:13 IST

 కొనసాగుతున్న తెదేపా నిరసనలు
పార్వతీపురంలో భారీ ర్యాలీ

పార్వతీపురంలో విజయచంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పార్వతీపురం, పట్టణం, కలెక్టరేట్‌ ప్రాంగణం, పాచిపెంట,  న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.విజయ్‌చంద్ర, మహిళా విభాగం నాయకురాలు డి.శ్రీదేవి ఆధ్వర్యంలో బాబు కోసం- మేము సైతం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సంఘీభావం తెలిపారు. అదరం.. బెదరం.. అక్రమార్కులను వదలమంటూ నినాదాలు చేశారు. బీ పాచిపెంటలో ఆ పార్టీ నేత పి.ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భంజ్‌దేవ్‌ పాల్గొన్నారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంతోషి, ఈశ్వరరావు, మోహన్‌రావు, పోలినాయుడు, పైడిపినాయుడు, సాయిబాబా, పారమ్మ, జనసేన నాయకులు ఉపేంద్ర పాల్గొన్నారు.  

దీక్ష బూని.. పూజలు చేసి

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: అశోక్‌ బంగ్లా వద్ద సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన దీక్షల్లో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి.సత్యమోహన్‌, నాయకులు కె.పైడిరాజు, బాలచంద్ర నాయుడు, కృష్ణారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం వీరికి పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మాజీ ఎమ్మెల్యే మీసాలగీత తన అనుచరులతో రామతీర్థం ఆలయాన్ని సందర్శించి, చంద్రబాబు విడుదల కోరుతూ పూజలు చేశారు. నగరంలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. టి.రమణ, డి.రవిరాజు, జి.ప్రణయ్‌ పాల్గొన్నారు.

బాబు కోసం  మేముసైతం

గజపతినగరం: జాతీయ రహదారి పక్కన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో దీక్షల్లో గీతకార్మికులు పాల్గొని మద్దతు తెలిపారు. చంద్రబాబుకు అండగా ఉంటామన్నారు. కొరుపోలు రమేష్‌కుమార్‌, ఈశ్వరరావు, చిన్నంనాయుడు పాల్గొన్నారు.  

వినూత్న నిరసన..: ప్రజాధనం రూ.43వేల కోట్లు తిన్న జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పొంది శనివారం నాటికి పదేళ్లు పూర్తయిందని, అప్పటి నుంచి రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనతో ప్రజలకు తిప్పలు తప్పడంలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా కేకుకోసి  వినూత్నంగా నిరసన తెలిపారు.

నెల్లిమర్ల: రాష్ట్రంలో వైకాపా తీరును ప్రజలంతా గమనిస్తున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. నెల్లిమర్లలో గీత కార్మికులతో కలసి రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై కుట్రపూరితమైన విధానాన్ని అవలంభిస్తోందన్నారు. కార్యక్రమంలో చిన్నంనాయుడు, రవిశేఖర్‌, రాజారావు, సత్యనారాయణ, ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని