logo
Updated : 09 Aug 2021 08:52 IST

AP News: 25 ఏళ్ల బంధాన్ని అనుమానం అంతమొందించింది..

విగతజీవిగా రమణమ్మ

లింగసముద్రం, న్యూస్‌టుడే: చిన్నపాటి అనుమానం అతన్ని కసాయిగా మార్చింది. తనతో ఇరవై అయిదేళ్లు కష్టసుఖాల్లో కలిసి కాపురం చేసిందనే విషయాన్నీ మర్చిపోయేలా చేసింది. కట్టుకున్న భార్యనే గొంతు కోసి కడతేర్చేలా చేసింది. ఈ విషాద సంఘటన లింగసముద్రం మండలంలోని అన్నెబోయినపల్లిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వీఆర్‌కోటకు చెందిన నరసింహం అనే వ్యక్తికి అన్నెబోయినపల్లికి చెందిన పొటికలపూడి రమణమ్మ(45)కు 25 సంవత్సరాల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులకు రమణమ్మ ఒక్కరే కుమార్తె కావడంతో భార్యతో కలసి నరసింహం అత్తగారింటికి దత్తత వచ్చాడు. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులకు వివాహాలు చేశారు. ఇటీవల కొద్దిరోజులుగా భార్య నడవడికపై నరసింహం అనుమానం పెంచుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్టు భావించాడు. ఆ అనుమానమే పెనుభూతంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యను కత్తితో గొంతు కోసి హతమార్చాడు. రమణమ్మ నెత్తుటి మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు ఉదయాన్నే గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కందుకూరు డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ శ్రీరాం, ఎస్సై మల్లికార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం కందుకూరు వైద్యశాలకు తరలించారు. అనంతరం నరసింహం గుడ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని