logo
Updated : 22 Aug 2021 08:50 IST

Crime News: ప్రేమించి మోసపోయా.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య

  మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు


ఉరి వేసుకోవడానికి ముందు... ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతున్న షేక్‌ బ్రహ్మం

వనస్థలిపురం, ముండ్లమూరు, న్యూస్‌టుడే: ‘‘నేనొక అమ్మాయిని ప్రేమించాను.. మోసపోయాను.. నా ఫ్రెండ్స్‌ అందరూ మోసం చేశారు.  నేను చనిపోతున్నాను..’’ అంటూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ముండ్లమూరు మండలం, పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం (36) లారీ యజమాని. ఇతనికి భార్య ఖాసీంబి,  కుమారుడు (10), కుమార్తె (8) ఉన్నారు. ఆర్థికంగా నష్టపోయిన అతను శనివారం ఉదయం తన స్నేహితుడు వేణుగోపాల్‌తో కలిసి వనస్థలిపురం వీఎంఆర్‌ లాడ్జ్‌ అండ్‌ బార్‌లో గది అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం ఇద్దరు కలిసి మద్యం తాగి గదికి వెళ్లి పడుకున్నారు. తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం తాగుతుండగా.. షేక్‌ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ... తాను ప్రేమించి మోసపోయానని, స్నేహితులూ మోసం చేశారని,  చనిపోతున్నానంటూ సీలింగ్‌ ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకున్నాడు. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు ఫోన్‌ చేసినా ఎత్తలేదు. వేణుగోపాల్‌.. తన స్నేహితుడు ఎంతకీ కిందకు రాకపోవడంతో ఫోన్‌ చేశాడు.. స్పందించకపోవడంతో గదికి వెళ్లాడు. కిటికిలోంచి చూసే సరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.సిబ్బంది గది తలుపులు తెరిచి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. పోలీసులు బ్రహ్మం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మం మృతికి సరైన కారణాలు తెలియాల్సి ఉందని, కుటుంబసభ్యులకు సమాచారం అందించామని వనస్థలిపురం పోలీసులు తెలిపారు 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని