logo
Updated : 05 Sep 2021 08:15 IST

Fraud: చీటీ పేరుతో మహిళ మోసం.. రూ.5.6 కోట్ల మేర కుచ్చుటోపీ

 చీటీ పాటల పేరుతో రూ.5.60 కోట్లకు టోపీ 


ఇంకొల్లు సీఐ సుబ్బారావుకు సమస్యను వివరిస్తున్న బాధితులు

చినగంజాం, న్యూస్‌టుడే: చీటీ పాటల పేరుతో ఓ మహిళ పలువురిని నట్టేట ముంచారు. సుమారు రూ.5.60 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. సోపిరాలకు చెందిన పోలకం ఝాన్సీలక్ష్మి, వెంకటస్వామి దంపతులు. వెంకటస్వామి మిలటరీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఝాన్సీలక్ష్మి సుమారు 25 ఏళ్లుగా సోపిరాలలో ఉంటూ చీటీ పాటలు నిర్వహిస్తూ అందరికీ నమ్మకం కలిగించారు. చీటీ పాటలు వేస్తున్న వారితో పాటు ఇతరుల నుంచి రూ. లక్ష, రూ.2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల చొప్పున అప్పుగా తీసుకున్నారు. ఇలా సుమారు రూ.5.60 కోట్ల వరకు పాటదారులు, అప్పులిచ్చిన వారికి చెల్లించాల్సి ఉంది. కొన్నినెలలుగా బాకీలు చెల్లించడం లేదు. ఈ క్రమంలోనే తాను ఉండే ఇంటిని ఝాన్సీలక్ష్మి ఇటీవల విక్రయించారు. అదేసమయంలో హైదరాబాద్, చీరాల తదితర పట్టణాల్లో విలువైన భవనాలు, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. అయితే చీటీ పాటలు పాడిన వారికి డబ్బులు చెల్లించకపోవడం, అప్పులు తీసుకున్నవారికి ఇవ్వకుండా తిప్పుకొంటున్నారు. బాధితులందరూ గట్టిగా నిలదీయడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు ఇచ్చినట్టు చెప్పారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుమారు యాభై మంది బాధితులు చినగంజాం పోలీసులను శనివారం ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంకొల్లు సీఐ సుబ్బారావు, ఎస్సై పి.అంకమ్మరావు తెలిపారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని