వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక
ఎంపికైన జిల్లా బాలుర వాలీబాల్ జట్టుతో నిర్వాహకులు
ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: బాలబాలికల వాలీబాల్ జిల్లా జట్ల ప్రాబబుల్స్ ఎంపిక ఒంగోలులోని డీఎస్ఏ మినీ స్టేడియంలో ఆదివారం చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు సూదనగుంట కోటేశ్వరరావు, ఛైర్మన్ మాలకొండయ్య, కార్యదర్శి డాక్టర్ ఎం.ఆంజనేయులు పర్యవేక్షణలో క్రీడాకారులను ఎంపిక చేశారు. ప్రాబబుల్స్ జట్టుకు ఒంగోలులో శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. వీరిలో మెరుగైన క్రీడాకారులతో తుది జట్టును ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.ధనుంజయుడు, శిక్షకుడు జి.రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శి ఎం.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
బాలుర జట్టు...: బి.హేమంత్, జి.మణికంఠ, బి.హితేష్(బోయినవారిపాలెం), ఎ.ఉమామహేశ్వరరావు(ఆలకూరపాడు), షేక్ ఉస్మాన్(కొమ్మాలపాడు), ఎం.ఈశ్వర్(అమ్మనబ్రోలు), ఎ.వాసు(కందుకూరు), ఎస్.యోగానందం(దర్శి), హర్షవర్ధన్(మడనూరు), సి.హెచ్.సాయి(పెదగంజాం), వి.నాగార్జున(ఈతముక్కల) బి.మనోజ్(అల్లూరు), పి.ప్రసాద్‌రెడ్డి(వజ్జిరెడ్డిపాలెం), టి.అజయ్(వల్లూరు), బి.శ్యామ్(ఈపూరుపాలెం), జి.వి.ఆర్.తేజారెడ్డి(చినగంజాం), జి.అభిషేక్‌రెడ్డి, సి.హెచ్.కోటి(కందుకూరు), వి.మధు, తిరుమలరెడ్డి(సంతనూతలపాడు).
బాలికల జట్టు: ఎం.నాగలక్ష్మి(లింగంగుంట), కె.అనూష, వి.స్వాతి(కరేడు), హెమీమా(ఆలకూరపాడు), కె.రమ్య(ఒంగోలు), కుముదిని(దర్శి), మౌనిక(ఆలకూరపాడు), సి.హెచ్.వర్షిత(ఆత్మకూరు), శైలు, నజీమా, విశాలాక్షి(బూదవాడ), జి.మంజూష, జి.లావణ్యలహరి(వల్లూరు), ఎ.దుర్గ(సింగరాయకొండ), వినూత్న, వాసంతి(ఒంగోలు), డి.నందిని(ఆలకూరపాడు), షౌజీను(కొండపి), ఎం.ధనుష్(చీరాల), భవాని(పోతలపాడు).
ఎంపికైన బాలికల జట్టు