logo
Published : 29/11/2021 04:53 IST

‘జిల్లా అభివృద్ధిని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం’

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా నుంచి పలు రంగాల్లో ఆదాయం లభిస్తున్నప్పటికీ, అభివృద్ధి పనులు చేపట్టడాన్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు విమర్శించారు. సీసీఎం 13వ జిల్లా మహాసభల సందర్భంగా స్థానిక సుందరయ్య భవన్‌లో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పేరుతో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూనాటి మాట్లాడుతూ.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రకాశం జిల్లా వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్‌.నారాయణ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు, పలు రాజకీయ, సంఘాల నాయకులు వై.సిద్దయ్య, జీవీ.కొండారెడ్డి, పి.హనుమంతురావు, శ్రీపతి ప్రకాశం, చుంచు శేషయ్య, రఫీ అహ్మద్‌ పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని