logo
Updated : 29/11/2021 04:55 IST

ఆటో, ద్విచక్ర వాహనం ఢీ

ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఆటోపైకి చేరిన ద్విచక్ర వాహనం

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం రాయవరం గ్రామ శివారులో చోటు చేసుకుంది. మార్కాపురం గ్రామీణ పోలీసుల వివరాల ప్రకారం .. మార్కాపురం పట్టణంలోని విద్యుత్తు కార్యాలయం వెనుక వీధిలో నివాసం ఉంటున్న షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌ (32) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. ఆదివారం బాడుగ నిమిత్తం గజ్జలకొండకు వస్తున్నారు. అతనితో పాటు తమ్మడపల్లికి చెందిన పిన్నిక సుబ్బులు అందులో ఉన్నారు. వీరి ఆటో రాయవరం వద్ద అదుపుతప్పి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న కొమ్ము విల్సన్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్‌ రెహమాన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సుబ్బులు, ద్విచక్ర వాహనదారుడు విల్సన్‌ను మార్కాపురంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. వైద్య సిబ్బంది స్పందించకపోవడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వారికి ప్రథమ చికిత్స చేశారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని