logo
Published : 29 Nov 2021 04:53 IST

4 నెలలుగా విటమిన్‌ ఎక్కడ!

వేటపాలెం, న్యూస్‌టుడే: ఏడాదిలోపు చిన్నారులకు టీకాలు వేస్తారు. వాటితో పాటు ఎ విటమిన్‌ ద్రావణం కూడా తాగిస్తారు. గడిచిన నాలుగు నెలలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఈ మందు తమ పిల్లలకు ఇప్పించేందుకు తల్లిదండ్రులు ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. వీటిపై ఆరోగ్య సిబ్బందిని ప్రశ్నిస్తే ఇంకా రాలేదు అంటున్నారే తప్ప ఎప్పుడు వస్తోందో స్పష్టంగా చెప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1,83,594 మంది చిన్నారులు...: జిల్లా వ్యాప్తంగా 90 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి కావాల్సిన మందులను ప్రతి రెండు నెలలకు ఒకసారి వైద్యులు ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు ఉంచుతారు. వీటిని డ్రగ్‌ స్టోర్‌ నుంచి పీహెచ్‌సీలకు సరఫరా చేస్తారు. అత్యవసరంగా కావాల్సిన వాటి గురించి అవసరమైన సమయంలో అక్కడి నుంచి తీసుకుంటారు. అయితే గడిచిన నాలుగు నెలలుగా ఎ విటమిన్‌ ద్రావణం సరఫరా లేకపోయింది. దీన్ని తొమ్మిది నెలల నుంచి ఏడాది లోపు చిన్నారులకు టీకాలు వేసే సమయంలో తొలిసారిగా తాగిస్తారు. ఆ తర్వాత ప్రతి అయిదు నెలలకు ఒకసారి తొలిసారిగా వేసిన మందుకి రెట్టింపు ఇస్తారు. ఇలా అయిదు సంవత్సరాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు వైద్యసిబ్బంది వేస్తుంటారు. వీరి లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 9 నెలల నుంచి 5 సంవత్సరాల్లోపు చిన్నారులు దాదాపు 1,83,594 మంది ఉన్నారు.

ఇవీ ఒనగూరే ప్రయోజనాలు...: ఎ విటమిన్‌ తాగించడం వల్ల చిన్నారుల్లో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. రక్తహీనత నివారణకు దోహదపడుతుంది. నేత్ర సంబంధిత వ్యాధులు అంటే ప్రధానంగా రేచీకటి రాదు. తెల్లమచ్చలు(సోబి), బుద్ధిమాంద్యం రాకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఈ మందు కేవలం ప్రభుత్వ వైద్యశాలల్లోనే లభ్యమవుతుంది. అందుకే సరఫరా నిలిచిపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో రత్నావళి మాట్లాడుతూ.. విచారించి వెంటనే సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని