logo
Updated : 30/11/2021 06:29 IST

తమ్ముని వివాహ వేడుకలో అన్న హత్య


ఖాసిం (పాత చిత్రం)

దర్శి, న్యూస్‌టుడే: దర్శిలో ఆదివారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. తమ్ముని వివాహ వేడుకల్లో పాల్గొన్న అన్న ఇద్దరు వ్యక్తుల దాడిలో చనిపోయాడు. దర్శి స్టేషన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ముస్లిం బజారులో నివాసముంటున్న బి.హుస్సేన్‌, దస్తగిరమ్మ దంపతుల పెద్ద కుమారుడైన ఖాసిం(30) బీఎస్సీ (వ్యవసాయం) చదివాడు. ఓ ప్రైవేటు పురుగుమందుల కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ప్రస్తుతం అది మానివేసి ఇంటి వద్దే తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. అతని తమ్ముడి వివాహం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో షేక్‌ సైదాబీ అనే మహిళకు ఖాసిం చేయి తగిలింది. తనతో అతను అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె తన భర్త మస్తాన్‌వలీకి తెలిపారు. అనంతరం భార్యాభర్తలిరువురూ ఖాసింపై దాడి చేశారు. గుండెలపై విచక్షణారహితంగా కొట్టడంతో స్పృహ కోల్పోయిన ఖాసింను కుటుంబసభ్యులు హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. సీఐ బీమానాయక్‌, ఎస్సై చేరుకుని ఘటనపై ఆరా తీశారు. శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. ఓ వైపు వివాహ వేడుకలు.. అదే సమయంలో తోడబుట్టినవాడు హత్యకు గురికావడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని