logo
Published : 02/12/2021 05:36 IST

కొవిడ్‌ మూడో దశపై అప్రమత్తం


మండల అధికారులతో వీక్షణ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కొవిడ్‌ మూడో దశ పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ మూడో దశ, గృహ నిర్మాణ ఓటీఎస్‌, పంచాయతీరాజ్‌శాఖ అభివృద్ధి పనులపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం జిల్లాలోని మండల అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ మూడో దశ ప్రమాదకరంగా ఉంటుందన్న సూచనలు కనిపిస్తున్నాయన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికి టీకా వేయించాలని సూచించారు. మండల స్థాయి కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా తిరిగేవారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద ప్రభుత్వం మంజూరు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఓటీఎస్‌ లక్ష్యాలను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీలు చేతన్‌, కె.ఎస్‌.విశ్వనాథన్‌, జడ్పీ సీఈవో జాలిరెడ్డి, డీపీవో నారాయణరెడ్డి, డీఆర్డీఏ పీడీ బాబురావు, డ్వామా పీడీ శీనారెడ్డి పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని