logo
Published : 02/12/2021 05:36 IST

పొగాకు రైతులను ఆదుకునేందుకు చర్యలు


సమావేశంలో మాట్లాడుతున్న పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పొగాకు పంటతోపాటు, నారుమళ్లను పరిశీలించామని.. జరిగిన నష్టాలను రైతులను అడిగి తెలుసుకున్నామన్నారు. వారిని ఆదుకోవడంతోపాటు, గిట్టుబాటు ధరలు వచ్చేందుకు, ఎగుమతుల గురించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 3న జరగనున్న సమావేశంలో చర్చిస్తామన్నారు.. కూలీల కొరతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ యాంత్రీకరణతోపాటు, నూతన వంగడాలను ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాలో 26,661 మంది రైతులు 20,533 బ్యారన్ల కింద 41,880 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 21,399 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైనట్లు వివరించారు. ఇటీవల భారీ వర్షాలకు 4,586.50 హెక్టార్లల్లో పంట దెబ్బతిందన్నారు. అందులో 1,985 హెక్టార్లలో పూర్తిగా; మిగతా విస్తీర్ణంలో పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో వేలం కేంద్రాల నిర్వహణాధికారులు శ్రీనివాసరావు, రవికాంత్‌, కె.రామకృష్ణ, ఎస్‌జీవో తులసి పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని