logo
Published : 02/12/2021 05:36 IST

5న సబ్‌ జూనియర్‌ కబడ్డీ జట్ల ఎంపిక

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: జిల్లా సబ్‌జూనియర్‌ బాల బాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఈ నెల 5వ తేదీన ఒంగోలులో జరగనుంది. నెల్లూరు బస్టాండు ప్రాంతంలోని డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రక్రియ ఉంటుందని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు తెలిపారు. 56కేజీలు, అంతకంటే తక్కువ బరువు ఉన్న బాల బాలికలు, 2006 జనవరి 1 తర్వాత జన్మించిన వారు మాత్రమే హాజరయ్యేందుకు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ నెల 5వ తేదీన తమ ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 19 వరకు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జరిగే 31వ అంతర్‌ జిల్లాల కబడ్డీ టోర్నీలో పాల్గొంటారన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని