logo
Published : 02/12/2021 05:36 IST

అధికార పార్టీ నాయకుల బాహాబాహీ


సచివాలయంలో ఘర్షణ పడుతున్న ఇరువర్గాల నాయకులు

టంగుటూరు, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయని కలెక్టర్‌కు కందులూరు గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం నిర్వహించిన విచారణ సమవేశంలో అధికార పార్టీ నాయకులు ఘర్షణకు దిగారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ దుస్తులు చింపుకొని కొట్లాడారు. ఓ వర్గం నాయకులు సభలోని కుర్చీలను ధ్వంసం చేసి స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి 18 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. కందులూరు గ్రామంలో 2020-21 సంవత్సరానికి గాను చేపట్టిన అభివృధ్ధి పనులల్లో రూ.10 లక్షల వరకు అక్రమాలు జరిగాయని అధికార పార్టీకి చెందిన ఒక వర్గం డ్వామా అధికారులకు నెల క్రితం ఫిర్యాదు చేశారు. నవంబర్‌లో గ్రామంలో విచారణ చేసిన అధికారులు రూ.3.50 లక్షల వరకు అక్రమాలు జరిగాయని నిర్ధరించి, రికవరీ చేయాలని ఏపీవోలకు నోటీసులు పంపించారు. దీనిపై సంతృప్తి చెందని సదరు వర్గం విచారణ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించారని పది రోజుల క్రితం కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా విజిలెన్స్‌ అధికారి జ్యోతి, ఏపీడీ శ్యాంసన్‌, అంబుడ్స్‌మెన్‌ బుధవారం గ్రామంలో సభ నిర్వహించారు. ఉపాధి పనుల్లో అధికారులంతా లంచాలు తీసుకుని తప్పుడు బిల్లులు సృష్టించారని ఓ వర్గం నాయకులు ఆరోపిస్తూ మరో వర్గానికి చెందిన వారిపై ఘర్షణకు దిగారు. దీంతో సింగరాయకొండ సీఐ లక్ష్మణ్‌, ఎస్సైలు, సిబ్బంది అక్కడకు చేరుకొని ఇరువర్గాలకు చెందిన 18 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసి సమస్యను పరిష్కరించారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని