logo
Published : 02/12/2021 05:36 IST

దెబ్బతిన్న పంటల పరిశీలన

గుంటుపల్లి వద్ద ఇసుక మేటలు వేసిన వరి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

పీసీపల్లి, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లో మినుము, వరి, కంది, మిరప తదితర పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల వర్షపునీటి ప్రవాహానికి వరిపంటపై ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వీటిపై ‘ఆందోళనలో అన్నదాతలు’ అన్న శీర్షికన బుధవారం ‘ఈనాడు’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కనిగిరి వ్యవసాయశాఖ ఉప సంచాలకుడు వెంకట రమణ గుంటుపల్లి ప్రాంతంలో దెబ్బతిన్న వరి, కంది పంటలను బుధవారం పరిశీలించారు. పంట నష్ట నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఆయన వెంట ఇన్‌ఛార్జి వ్యవసాయాధికారిణి శిల్ప, సిబ్బంది, రైతులు ఉన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని