logo
Published : 02/12/2021 05:36 IST

మహమ్మారిని పారద్రోలాలి

ఒంగోలు నగరంలో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎయిడ్స్‌ మహమ్మరిని పారద్రోలడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు. జిల్లా ఎయిడ్స్, కుష్ఠు వ్యాధి నియంత్రణశాఖ; వైద్య,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద బుధవారం అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలన్నారు. జేసీ కె.కృష్ణవేణి మాట్లాడుతూ తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్‌ సంక్రమించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, డీఎంహెచ్‌వో రత్నావళి, అదనపు డీఎంహెచ్‌వో పద్మావతి, జిల్లా యువజన అధికారి కమల్‌సా, స్టెప్‌ సీఈవో రవికుమార్, ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీదేవి, డీటీసీవో సురేష్‌ పాల్గొన్నారు. కలెక్టరేట్‌ నుంచి అంబేడ్కర్‌ భవన్‌ వరకు ర్యాలీ కొనసాగింది. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని