logo
Published : 02/12/2021 05:36 IST

రూ.10.62 కోట్ల సమగ్రశిక్ష నిధులు విడుదల

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలోని పాఠశాలలు, సముదాయ కేంద్రాలు, ఎమ్మార్సీ కార్యాలయాలకు సమగ్రశిక్ష నిధులు రూ.10.62 కోట్లు విడుదల చేసినట్లు డీఈవో బి.విజయభాస్కర్‌ తెలిపారు. పాఠశాల గ్రాంటు కింద రూ.9.18 కోట్లు, స్కూల్‌ కాంప్లెక్స్‌లకు రూ.1.03 కోట్లు, మండల రిసోర్స్‌ కేంద్రాలకు రూ.42 లక్షలు విడుదలయ్యాయన్నారు. ఒక్కొక్క మండల రిసోర్స్‌ కేంద్రానికి రూ.75వేలు, మండల సముదాయ కేంద్రానికి రూ.22 వేలు, 15 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలకు రూ.10వేలు, 15 నుంచి 100 లోపు పిల్లలు ఉంటే రూ.25వేలు, 100 నుంచి 250 మధ్య విద్యార్థులుంటే రూ.50 వేలు, 250 పైన ఉంటే రూ.75 వేలు విడుదల చేశారు. వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈనెల 3వ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం మండలానికి రూ.4వేల చొప్పున విడుదల చేశామన్నారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని