logo
Published : 02/12/2021 05:36 IST

ప్రమాదపుటంచున.. !

 మోపాడు జలాశయం కట్టకు లీకులు

పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు 

30 అడుగులకు చేరి ప్రమాదకరంగా ఉన్న మోపాడు జలాశయం

అదే ప్రాంతం.. అదే జలాశయం.. సరిగ్గా 25 ఏళ్ల క్రితం విరుచుకుపడి గ్రామాలను వరద ముంచెత్తి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నాటి విధ్వంసం ఆ ప్రాంత పెద్దల కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అయినా జలాశయం నిర్వహణ మెరుగుపడలేదు. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు తప్ప ముప్పు లేకుండా పటిష్ఠ పనులు లేవు. బుధవారం మరోసారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లీకులు ఏర్పడి కట్ట తెగే అవకాశముందన్న హెచ్చరికలు రావడంతో సమీప గ్రామాలు వణికిపోయాయి. ఇదీ పావ΄రు మండలం మోపాడు జలాశయం వద్ద పరిస్థితి.  - న్యూస్‌టుడే, కనిగిరి, పావ΄రు

పావ΄రు, సీఎస్‌పురం, నల్లమల ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో మోపాడు జలాశయానికి భారీగా వరద వచ్చింది. దీని సామర్థ్యం 29 అడుగులు కాగా 30 అడుగుల వరకు జలం ఉండటంతో ఆనకట్ట ఉనికే ప్రమాదకరంగా మారింది. కట్టకు దిగువ భాగంలో 5 చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. సమీపంలో గ్రామాలతో పాటు దాదాపు 20 వేల ఎకరాల పొలాలు ఉండటంతో పది ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కట్ట తెగిపోతుందేమోనన్న సమాచారంతో కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ సిన్సిన్వార్, కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, జలవనరులశాఖ ఎస్‌ఈ లక్ష్మీరెడ్డి, పావ΄రు తహసీల్దార్‌ ఉష తదితరులు రిజర్వాయర్‌కు దిగువన ఉన్న మోపాడు, ఎస్సీకాలనీ, రేగిచెట్లపల్లి, బొట్ల గూడూరు, కంభాల దిన్నె తదితర ప్రాంతాల్లో అప్రమత్తం చేశారు. మోపాడులో ఇళ్లు ఖాళీ చేయించి 200 కుటుంబాలను లక్ష్మీనర్సాపురం ఉన్నత పాఠశాలకు తరలించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, జలవనరుల శాఖ, పోలీసు అధికారులు పరిస్థితి సమీక్షించారు. ఉదయం నుంచి శ్రమించి సిమెంట్, ఇసుక బస్తాలు, మట్టి వేసి లీకేజీల వద్ద తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. అలుగు వద్ద కాలువ తీసి నీరు బయటకు పోయేలా చేశారు. యంత్రాలతో కొంతవరకు చిల్ల చెట్లను తొలగించారు. ఇక కట్ట నుంచి రాత్రయినా లీకేజీలు నియంత్రణలోకి రాలేదు. కనిగిరి ఎమ్మెల్యే మధుసూదనయాదవ్‌ బుధవారం రాత్రి ఇక్కడకు వచ్చి పరిశీలించారు. 


జేసీబీతో మట్టి పోసి కట్టను గట్టిపరుస్తున్న దృశ్యం

శాశ్వత పనులు కానరావు
మోపాడు రిజర్వాయర్‌కు ఏటా నిధులు వెచ్చించి మరమ్మతులు చేస్తున్నారే తప్ప కట్టను కట్టుదిట్టంగా చేసే పనులు కానరావడంలేదని స్థానికులు వాపోయారు. కట్ట ఎక్కడికక్కడ దెబ్బతింది. విపరీతంగా చెట్లు మొలిచాయి. దీంతో లీకేజీలకు ఆస్కారమేర్పడింది.
 నాటి మాదిరిగా...
2009లో జలాశయం ఇదే మాదిరి పూర్తిగా నిండిపోయి ముప్పు తలెత్తింది. ప్రస్తుతం ఏమాత్రం భారీ వర్షాలు పడినా ప్రాణ, పంటనష్టం ఏర్పడుతుందని మోపాడు, బొట్లగూడూరు, బలిజపాలెం, లక్ష్మీనర్సాపురం, ఇనిమెర్ల, రేగుచెట్లపల్లి, కమ్మవారిపల్లి, కొత్తపల్లి ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.
పోలీసులు,  తెదేపా నేతల మధ్య వాగ్వాదం

పోలీసులను నిలదీస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి, నేతలు

మోపాడు రిజర్వాయర్‌ వద్దకు మాజీ ఎమ్మెల్యే, కనిగిరి నియోజకవర్గ తెదేపా నాయకుడు ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి, నాయకులు బుధవారం వెళ్లారు. ఎస్సై కె.సురేష్, పోలీసులు అడ్డుకున్నారు. తాము సాయంగా ఉండి పనులు చేసేందుకు వచ్చామని చెప్పినా అనుమతించలేదు. ‘మీ అవసరం లేదు.. మాదే బాధ్యత’ అంటూ పోలీసులు సమాధానం ఇచ్చారు. ఓ దశలో ఇరుపక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు నాయకులను పోలీసులు చేతులతో నెట్టారు. కనిగిరి సీఐ పాపారావు జోక్యంతో సమస్య సద్దుమణిగింది. కాగా అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో అనుమతించలేదని ఎస్సై అన్నారు.


కట్ట తెగుతుందనే భయంతో పునరావాస కేంద్రానికి తరలుతున్న మోపాడు గ్రామస్థులు

 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని