logo
Published : 02/12/2021 05:36 IST

రాళ్లపాడుకు భారీ వరద 

అప్రమత్తమైన మన్నేరు పరివాహక ప్రజలు 

రాళ్లపాడు జలాశయం నుంచి మన్నేరులోకి నీరు విడుదల

లింగసముద్రం, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వద్ద గండిపాలెం ప్రాజెక్టుతో పాటు నక్కలగండి..మన జిల్లాలోని మోపాడు రిజర్వాయర్‌ నుంచి వచ్చిన వరద ప్రవాహంతో రాళ్లపాడు జలాశయం నిండిపోయింది. మోపాడు వద్ద కట్టలు తెగే అవకాశముండడంతో తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రాళ్లపాడు కొత్త స్పిల్‌వే గేట్లు ఎత్తి సుమారు 1 టీఎంసీ నీటిని దిగువనున్న మన్నేరుకు విడుదల చేశారు. 1994, 96లో భారీ స్థాయిలో నీరు చేరడంతో చోటు చేసుకున్న పరిణామాలు మరో దఫా జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లా కొండాపురం-లింగసముద్రం మధ్య బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మణపల్లి సమీపంలో పొలాల్లోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టు వంతెనపైకి ఎవరినీ రానివ్వలేదు. మన్నేరు పరివాహక ప్రాంతాలైన గుడ్లూరు, కందుకూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం, ఉలవపాడు మండలాల్లో అప్రమత్తం చేశారు. గుడ్లూరు మండలం గుండ్లపాలేనికి చెందిన కొందరు ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తిరిగి చేరుకున్నారు. 

సమయం ఉదయం  5.00 9.55 10.50 11.50  మధ్యా|| 2.45  సా|| 4.30

చేరిన నీరు(క్యూసెక్కులు)  15236 23340 26926 19808 12990 13342

విడుదల(క్యూసెక్కులు) 15236 40290 56780 33623 17860 17712

అయ్యో.. పందువ ‘గండి’
వెలిగండ్ల, న్యూస్‌టుడే: వెలిగండ్ల మండలంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి పందువగండి రిజర్వాయర్‌కు వరద తాకిడి ఎక్కువై బుధవారం గేట్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మరమ్మతులపై పలుమార్లు జలవనరులశాఖ అధికారులను కోరినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు అన్నారు. వేలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీరు వృథాగా పోకుండా చేయాలని కోరారు. గన్నవరం వద్ద వాగు ఉద్ధృతితో రాకపోకలు ఆగిపోయాయి. ఎస్‌ఐ టి.రాజ్‌కుమార్‌ పర్యవేక్షించారుగేట్లు తెగిపోవడంతో వృథాగా పోతున్న జలాలు 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని