logo
Published : 03/12/2021 05:30 IST

మంత్రి వ్యాఖ్యలపై నిరసన గళం

ఓటీఎస్‌ పథకానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.రాము మాట్లాడుతూ.. మంత్రి అప్పలరాజు తన నియోజకవర్గంలోని సచివాలయాల్లో విధులకు హాజరైతే వీఆర్వోలను తరిమివేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వీఆర్వోల సంఘానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒంగోలు నగర, మండలానికి చెందిన వీఆర్వోలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. - న్యూస్‌టుడే: ఒంగోలు గ్రామీణం

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని