logo
Updated : 03/12/2021 06:31 IST

మార్టూరు విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం 

ఒకరి మృతి... ముగ్గురు సిబ్బందికి గాయాలు


కోటేశ్వరరావు (పాత చిత్రం)

మార్టూరు, న్యూస్‌టుడే: ట్రాన్స్‌కో విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుని ఒకరు మృతి చెందగా... మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మార్టూరు పరిధిలో గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు అధికారులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పదహారో నంబరు జాతీయ రహదారి వెంబడి జొన్నతాళి కూడలి సమీపంలో... మార్టూరు 132 కేవీ విద్యుత్తు కేంద్రం ఉంది. లోపల కొన్ని ఛానళ్లు దెబ్బతినడంతో... ఏఈ బత్తుల సురేశ్‌, సబ్‌ ఇంజినీర్‌ బాణావత్‌ జీవానాయక్‌, షిఫ్ట్‌ ఆపరేటర్‌ మహ్మద్‌ మీరావలి... మరమ్మతులు చేపడుతున్నారు. అక్కడే వాచ్‌మెన్‌ అరవీటి కోటేశ్వరరావు (43) ఉన్నారు. ఈ క్రమంలో ఐసోలేటర్‌ దెబ్బతిని... ఒక్కసారిగా మొత్తానికి విద్యుత్తు సరఫరా అయ్యింది. దీంతో అక్కడున్న నలుగురూ విద్యుదాఘాతానికి గురై... గాయపడ్డారు. కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో మార్టూరు సీహెచ్‌సీకి తరలించగా... అప్పటికే కోటేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేతాజీనగర్‌లో నివాసముంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు ఆరోపించారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని