logo
Published : 03/12/2021 05:30 IST

ఉత్తరం రాస్తే ప్రధానిని కలిసే అవకాశం

● తపాలా శాఖ వినూత్న కార్యక్రమం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, జూనియర్‌ కళాశాలల్లో నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు ప్రధాన మంత్రికి ఉత్తరం రాస్తే ఆయన్ని కలిసే అవకాశం కల్పిస్తున్నట్లు సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టల్‌ డి.రమణయ్య తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని గుర్తింపు పొందిన వీరులు, 2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలి అనే అంశాల మీద వ్యాసం రాసి తపాలా శాఖ నియమించిన నోడల్‌ అధికారులకు ఉత్తరాలు అందజేయాలని కోరారు.విద్యార్థులు రాసిన ఉత్తరాల నుంచి ఉపాధ్యాయులు ఉత్తమంగా ఉన్న వాటిలో నుంచి పది లేఖలను ఎంపిక చేసి పంపాలని సూచించారు. తెలుగు, హిందీ , ఆంగ్లంతో పాటు ఏ ప్రాంతీయ భాషలో రాసినా ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నారు. డిసెంబరు 1 నుంచి 20వ తేదీ వరకు వచ్చే లేఖలను పరిశీలించి వాటిలో అత్యుత్తమమైన 75 లేఖలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎంపికచేసిన ఉత్తరాలను జనవరి 17న దిల్లీలో జరిగే ఫొటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన 75 మందితో ప్రధాని ముఖాముఖి మాట్లాడతారని పేర్కొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని