logo
Published : 03/12/2021 05:30 IST

పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత


చికిత్స పొందుతున్న బాలికతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ వెంకటరెడ్డి

మార్టూరు, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనిది. మార్టూరులోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటున్న కొందరు బాలికలు... స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. గురువారం పాఠశాలలో భోజనం చేశాక... పది మంది అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారి వాంతులు చేసుకోవడంతో సమీప ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ వెంకటరెడ్డి రాత్రి తొమ్మిది గంటల సమయంలో వారందరినీ సీహెచ్‌సీకి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం అయిదుగురిని ఒంగోలు రిమ్స్‌కు తీసుకువెళ్లారు. ఒంగోలు ఎంఈవో కిషోర్‌బాబు, ఎస్సై చౌడయ్య, ఉపాధ్యాయులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని