logo
Published : 03/12/2021 05:30 IST

పాఠాలు గోడలకు చెప్పాలా..?


విద్యార్ధులు లేక ఖాళీగా కుర్చున్న ఉపాధ్యాయులు

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎయిడెడ్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు. దీంతో ఎయిడెడ్‌ పాఠశాల ఉన్నా.. విద్యార్థులు ఒక్కరూ లేని పరిస్థితి. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిత్యం పాఠశాలకు వచ్చిపోతున్నారు. తమను డిప్యుటేషన్‌ మీద బదలాయించాలని కోరినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని వాపోతున్నారు కొమరోలు మండలం గోపానిపల్లె ఏబీఎం ద్రవ్య సహాయక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు. ప్రాథమిక పాఠశాలలో అక్టోబర్‌ 25న 111 మంది విద్యార్థులు ఉండగా.. వారంతా ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. నలుగురు ఉపాధ్యాయులు ఉన్న ఈ పాఠశాలలో ఒకరు పదవీ విరమణ చేయగా మిగిలిన వారు ఖాళీగా ఉంటున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉంటే వారి కోసం నాలుగు పోస్టులు మంజూరు చేశారు. ఒకరు పదవీ విరమణ చేయడంతో ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు లేకపోవడంతో రెండు నెలలుగా ఉపాధ్యాయులు రోజూ వచ్చి పోతున్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని