logo
Published : 03/12/2021 05:30 IST

క్యాబిన్‌లో చిక్కుకున్న చోదకుడు

 మూడు గంటలు శ్రమించి రక్షించిన 108 సిబ్బంది

పర్చూరు, న్యూస్‌టుడే: ప్రమాదానికి గురైన మినీ లారీ క్యాబిన్‌లో చోదకుడు చిక్కుకుపోయారు. 108 సిబ్బంది... మూడు గంటల పాటు శ్రమించి అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం వామపల్లికి చెందిన మినీ లారీ చోదకుడు జి.మాధవనాయుడు... గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో లోడు దించారు. అనంతరం... చీరాల నుంచి చిత్తూరుకు మరో లోడు తీసుకువెళ్లేందుకు... బుధవారం రాత్రి చీరాల బయలుదేరారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో... పర్చూరు - కారంచేడు మధ్య పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో ఓ చెట్టును ఢీకొన్నారు. దీంతో లారీ ముందు భాగం నుజ్జయి... క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పర్చూరు, కారంచేడు 108 సిబ్బంది... వీరాస్వామి, లక్ష్మణ్, కిషోర్‌బాబు, షరీఫ్‌ వాహనాలతో అక్కడకు చేరుకున్నారు. చోదకుడిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. పర్చూరు స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రమణయ్య సిబ్బందితో సహా వచ్చారు. లారీ భాగాలు విడగొట్టినా ప్రయోజనం లేకపోయింది. చివరకు లారీ వెనుక భాగంలో తాడు కట్టి... 108 వాహనాలతో లాగారు. ఉదయం ఆరు గంటలకు... అతి కష్టం మీద ఆయనను బయటకు తీశారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని