logo
Published : 03/12/2021 05:30 IST

మల్లన్న చెంతకెళ్తూ మహేశ్వరి దుర్మరణం


మహేశ్వరి (పాతచిత్రం)

పెద్దదోర్నాల, శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: కార్తిక మాసం సందర్భంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వెళుతూ నల్లమల ఘాట్ రహదారిలోని చిన్నారుట్ల సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ప్రమాదంలో మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీలో నివాసం ఉంటున్న మాదాసు బసవయ్య కుమార్తె మహేశ్వరి(19) దుర్మరణం చెందారు. ఈమె గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ చదువుతోంది.  శ్రీశైలంలో ఉన్న తన స్నేహితురాలితో కలిసి మల్లన్నను దర్శించుకోవాలని ఆర్టీసీˆ బస్సులో వెళుతూ.. ఘాట్‌ రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో ఆమె తల కిటికీ బయట పెట్టి ప్రకృతి అందాలను తిలకిస్తుండగా.. అదే సమయంలో శ్రీశైలం నుంచి పెద్దదోర్నాల వైపు వస్తున్న మినీ లారీ తలను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.  ఆత్మకూరు డీఎం సుధాకర్, శ్రీశైలం ఆర్టీసీ బస్‌స్టేషన్‌ మేనేజర్‌ మధుకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బసవయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె మహేశ్వరి మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం తెలుసుకున్న దోర్నాల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని