logo
Published : 03/12/2021 05:30 IST

కొండల్లో అక్రమార్కుల దందా !

యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ విక్రయాలు


వెంకటాచలంపల్లి సమీపంలో మట్టి తవ్వకాలు

దర్శి, న్యూస్‌టుడే: పర్యావరణానికి ప్రతిరూపాలైన కొండలు కరిగిపోతున్నాయి. కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మట్టి తవ్వి వ్యాపారం చేసుకోవడమే గాక స్టాకు పాయింట్లు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. అనుమతులతో పనిలేదు. నేతల ఆశీస్సులుంటే చాలన్న మాదిరి వ్యవహరిస్తున్నారు. దర్శి మండలంలో తాజాగా జరుగుతున్న దందా ఇది. 
ఎక్కడెక్కడ: ్ర వెంకటాచలంపల్లికి సమీపంలో కురిచేడు వెళ్లే మార్గంలో ఉన్న కొండ నుంచి గ్రావెల్‌ తవ్వేస్తున్నారు. దీంతో ఒకవైపు ఇది పూర్తిగా కరిగిపోయింది. డ్వామా ఆధ్వర్యంలో పచ్చదనం కోసం ఇక్కడ మొక్కల పెంపకం కూడా చేపట్టారు. ్ర ఇదే గ్రామానికి సమీపంలో దొనకొండ రోడ్డులో కొండ.. పోతవరం రోడ్డులో ఉన్న మరో కొండ నుంచి పొక్లెయిన్లు, ట్రాక్టర్లు, టిప్పర్ల సాయంతో మట్టిని తరలిస్తున్నారు. కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ మండలాల్లోని పలు ప్రాంతాలకు ఇక్కడినుంచి మట్టి వెళ్తోంది.
నాయకులకు ఆదాయ వనరుగా: మట్టి వ్యాపారంతో నాయకులు సొంతంగా యంత్రాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు కొనుగోలు చేశారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. మండలంలో దాదాపు 500 ఎకరాల్లో కొండ పోరంబోకు భూములున్నాయి. వాటిలో మట్టిని తవ్వి తరలించాలంటే రెవెన్యూతో పాటు అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి నిబంధనల మేర మాత్రమే పనులు చేపట్టాలి. వీటన్నిటినీ తుంగతో తొక్కేశారు. ట్రాక్టరుకు రూ.500 నుంచి రూ.600, టిప్పర్‌ మట్టి రూ.2,000 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు.

ప్రభుత్వ పనుల పేరుతోనే.. 
దర్శి పట్ణణంలో ప్రభుత్వ పనులకు మట్టి కావాలని సంబంధిత అధికారులకు అర్జీలు ఇస్తారు. ఎలాంటి అనుమతులు రాకుండానే పరిమితికి మించి తరలిస్తున్నారు. కొండ మట్టి నాణ్యంగా ఉండటం, ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పనులకు అవసరం ఉండటంతో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దర్శి పట్టణంలో ఏకంగా నిల్వ కేంద్రాలు కూడా ఏర్పాటుచేశారు. అవసరమైన వారు అడిగిన వెంటనే ఇక్కడే విక్రయిస్తున్నారు. గుత్తేదారులు కూడా ఈ మట్టి మాఫియానే ఆశ్రయించడం విశేషం. తహసీల్దార్‌ వరకుమార్‌ వద్దకు సమస్యను తీసుకువెళ్లగా ప్రభుత్వ పరంగా మట్టి తవ్వకాలు, తరలింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఆయా వాహనాలను అడ్డుకుంటామని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని