logo
Published : 03/12/2021 05:30 IST

రక్త పరీక్షలకుఆటంకం

 జీజీహెచ్‌లో ఖాళీ అయిన రసాయనాలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాకే పెద్ద దిక్కయిన ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో ప్రస్తుతం వివిధ పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. ఇక్కడి ప్రయోగశాలలో రసాయనాలు, రీఏజంట్లకు గత వారం రోజులుగా కొరత ఏర్పడింది. ఆసుపత్రిలో ఆర్ధో, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, దంత, గైనకాలజీ విభాగాలకు సంబంధించి రోజుకు 300 నుంచి 500 మందికి రక్తపరీక్షలు అవసరమవుతాయి. షుగర్, లిపిడ్‌ ప్రొఫైల్, కొవ్వుశాతం తదితరాలు నిర్ధారణ చేయడానికి అవసరమైన రసాయనాలను స్థానికంగానే కొనుగోలు చేస్తుంటారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్‌) లేదా ఆరోగ్యశ్రీ నిధులను ఇందుకు ఖర్చుచేస్తారు. ఇటీవల కొన్ని నిబంధనల మూలంగా కొనుగోలుకు సమస్య ఉత్పన్నమైంది. స్థానికంగా వాటిని సరఫరా చేసే ఏజెన్సీకి దాదాపు రూ.2 కోట్ల బిల్లు చెల్లించాల్సి ఉంది. అది పెండింగులో ఉండడంతో సరఫరా ఇచ్చేందుకు ఏజెన్సీ సుముఖత చూపడంలేదు. దీనికి తోడు ఆరోగ్యశ్రీ నిధుల వినియోగానికి సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. వాటి ఖర్చుపై ఇంతవరకు ఆడిట్‌ పూర్తికాలేదు. అది జరిగితేనే నిధులు మంజూరు చేసేలా నిబంధన విధించారు. దీంతో రసాయనాల కొనుగోలు సమస్యగా మారింది.
* అవీ అయిపోతే..  రెండురోజుల్లో ఆసుపత్రిలో ఉన్న కొద్దినిల్వలు అయిపోతాయని సమాచారం. ఇకపై పరీక్షలు చేయడం ఎలా అనేది వైద్యాధికారుల ముందున్న సమస్య. వారం క్రితమే ప్రయోగశాల సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.శ్రీరాములు వద్ద ప్రస్తావించగా సమస్య ఉన్నమాట వాస్తవమేనని, స్థానికంగా కొటేషన్లు పిలిచి వాటిని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని