logo
Published : 03/12/2021 05:30 IST

విద్య.. వసతి దీవెనలకు

75 శాతం హాజరు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు అర్హత పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎన్‌.లక్ష్మానాయక్‌ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రతి విద్యార్థి హాజరు గుర్తుంచుకోవాలన్నారు. ఇదే విషయమై నెలవారీ గుర్తించడానికి కళాశాలల లాగిన్‌లో సేవ ప్రారంభించడం జరిగిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి హాజరును డిసెంబర్‌ 15వ తేదీలోపు అప్‌డేట్‌ చేసుకోవాలని కళాశాలల నిర్వహకులకు సూచించారు. హాజరు ఉన్నా, జ్ఞానభూమిలో నమోదు చేయకుంటే ఆ విద్యార్థి చెల్లించాల్సిన రుసుమును మాఫీ చేయడం కళాశాల బాధ్యతని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  


కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.5.28 కోట్లు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌తో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం నిమిత్తం రూ.5.28 కోట్లు విడుదలైనట్లు డీఆర్వో సరళా వందనం తెలిపారు. నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,459 దరఖాస్తులు రాగా, అందులో 1,057 మందికి రూ.50 వేల చొప్పున మంజూరైనట్లు తెలిపారు. మిగిలిన బాధిత కుటుంబ సభ్యులు తమ దరఖాస్తులను ప్రకాశం భవన్‌లోని కొవిడ్‌ కంట్రోలు కేంద్రంలో సమర్పించాలని కోరారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని